Telangana TET | తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల
Telangana TET | తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల
వచ్చే ఏడాది జనవరి 1 నుంచి 20 వరకు ఆన్‌లైన్ పరీక్షలు
ఈ నెల 5 నుంచి నుంచి ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ
ఈ నెల 20న దరఖాస్తుల స్వీకరణకు గడువు తేదీ విధింపు
Telangana TET - Hyderabad : తెలంగాణ రాష్ట్రంలో టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి నిర్వహించే అర్హత పరీక్ష (Teacher Eligibility Test) తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు సోమవారం పాఠశాల విద్యా శాఖ అధికారులు ఈ టెట్ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. టెట్ దరఖాస్తలు ఈ నెల 5 నుంచి ప్రారంభమవుతాయని తెలిపారు. ఆన్‌లైన్ దరఖాస్తులకు ఈ నెల 20 వరకు చివరి గడువు తేదీ విధించారు. అయితే వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహించనున్నారు. టెట్ పరీక్షలను (Computer Based Online Test-CBT) విధానంలో పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యా శాఖ అధికారులు తెలిపారు. టెట్ పరీక్షలకు అర్హత వివరాలు ఇలా ఉన్నాయి. టెట్ పేపర్-1 కు డీఈడీ పూర్తి చేసిన వారు, పేపర్-2 పరీక్షలకు బీఈడి పూర్తి చేసిన వారిని అర్హులుగా నిర్ణయించారు. అయితే స్కూల్ అసిస్టెంట్‌గా ప్రమోషన్ పొందడానికి టెట్ అర్హత ఉండాలని ప్రభుత్వం పేర్కొంది. ఈ నేపథ్యంలో వేల సంఖ్యలో ఉన్న ఇన్ సర్వీసు టీచర్లు కూడా ఇప్పుడు టెట్ పరీక్షకు హాజరు కానున్నారు.
రాష్ట్రంలో టెట్ నిర్వహణ ఇప్పటి వరకు మొత్తం తొమ్మిది సార్లు నిర్వహించారు. ఇక జనవరి 1 నుంచి ప్రారంభం కానున్న టెట్ నిర్వహణతో కలిపితే మొత్తం పదోసార్లు అవుతుంది. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత నిర్వహించేది టెట్ నిర్వహణ ఏడో సారి అవుతుంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోపే రెండు సార్లు టెట్‌ను నిర్వహించడం గమనార్హం. టెట్‌కు సంబంధించిన సమగ్ర వివరాలు కోసం https://schooledu.telangana.gov.in వెబ్‌సైట్‌లో సంప్రదించాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే ఈ ఏడాది మే 20 నుంచి జూన్ 2 వరకు ఆన్‌లైన్‌లో టెట్ నిర్వహించి ఫలితాలు విడుదల చేసిన సంగతి తెలిసిందే.
* * *
Leave A Comment